పోలీస్ ఔట్‌పోస్ట్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నాం. బెస్మెంట్ వరకే పనులు పూర్తయ్యాయని.. మిగిలిన పనులు మరుగునపడ్డాయనే విషయాన్ని తెలియజేశాం.
– శివకుమార్, సీఐ, ఆత్మకూర్
కాంట్రాక్టర్ అనారోగ్యంతోనే..
పోలీస్ ఔట్‌పోస్ట్ నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అనారోగ్యానికి గురికావడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పూర్తిచేసిన పనుల బిల్లులు చెల్లించాలని కోరారు. మిగిలిన పనులు చేపట్టేందుకు మరోమారు టెండర్ ఆహ్వానిస్తున్నాం. త్వరలోనే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకుంటాం.
– అనిల్‌శాస్త్రి, ఏఈ,
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్
●


