సర్‌ను గడువులోగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌ను గడువులోగా పూర్తి చేయాలి

Oct 8 2026 1:24 AM | Updated on Oct 8 2026 1:24 AM

● ఓటరు జాబితా పరిశీలకులుసురేంద్ర మోహన్‌

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఓటరు జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని మహబూబ్‌నగర్‌ జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు, రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌ అన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్‌ పురోగతిపై ఈఆర్‌ఓలు వివరించారు. జారీ చేసిన, పెండింగ్‌లో ఉన్న నోటీసులు, నిర్వహించిన హియరింగ్‌లు, మృతులు, వలస వెళ్లినవారు, 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్‌ కాని కేసులు, ఇతర అనామలీల వివరాలను వెల్లడించారు. రాజకీయ పార్టీలు నియమించిన బూత్‌ లెవల్‌ ఏజెంట్ల (బీఎల్‌ఏ)తోనూ పరిశీలకుడు మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండాలని, అనర్హుల పేర్లు తొలగించాలని సురేంద్ర మోహన్‌ సూచించారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే నోటీసులు జారీ చేసి, ఒక చోటే హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఐఆర్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాచారం అందిస్తూ, వారి సహకారంతో ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

● కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ నోటీసులు, హియరింగ్‌ ప్రక్రియను గడువుకు ముందే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో రేషనలైజేషన్‌ అనంతరం 862 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, ప్రతి కేంద్రానికి బీఎల్‌ఓను నియమించినట్లు చెప్పారు. మొత్తం 2,316 మంది బీఎల్‌ఏలు ఉన్నారని తెలిపారు. జిల్లాలో 7,32,488 మంది ఓటర్లు ఉండగా.. మృతులు, గుర్తించలేని, డబుల్‌ ఓటర్లుగా గుర్తించిన 1,03,086 మందిని మినహాయించగా ఆగస్టు 17న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 6,29,402 మంది ఉన్నా రని కలెక్టర్‌ వివరించారు. పేర్లు, చిరునామా, వయసు తదితర వివరాల్లో తేడాలున్న 2,36,590 మందికి నోటీసులు జారీ చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌ను వేగవంతం చేయాలని, మున్సిపల్‌ సిబ్బందిని కూడా భాగస్వాములను చేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు. ఉద్యోగులు నోటీసులకు స్పందించేలా సంబంధిత శాఖల అధికారులకు సూచించాలని తెలిపారు. అదనపు కలెక్టర్‌ జేఎల్‌బీ హరిప్రియ, డీఆర్‌ఓ నిర్మల, ఆర్డీఓ నవీన్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement