తప్పుడు ప్రచారం చేస్తే పరువునష్టం దావా వేస్తా | - | Sakshi
Sakshi News home page

తప్పుడు ప్రచారం చేస్తే పరువునష్టం దావా వేస్తా

Oct 8 2026 1:24 AM | Updated on Oct 8 2026 1:24 AM

కొల్లాపూర్‌: సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తే పరువునష్టం దావాతో పాటు క్రిమినల్‌ కేసులు వేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. కొల్లాపూర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. తాను నిజాయతీగా రాజకీయాలు చేశానని.. వ్యాపారాలు చేసి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. నిరంజన్‌రెడ్డి కొల్లాపూర్‌లో ఒకసారి పోటీచేస్తే డిపాజిట్‌ కూడా రాలేదన్నారు. వనపర్తి ప్రజలు ఒకసారి ఆయన పాలన చూశాక, రెండోసారి గెలిపించకుండా ఇంటికి పంపారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన గెలిచేది లేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను తాను కుర్చీ వేసుకొని మరీ పూర్తిచేయిస్తానని కేసీఆర్‌ పలుమార్లు చెప్పారని గుర్తుచేశారు. మరి ఎందుకు ప్రాజెక్టులను పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతుల పంటలను కాపాడేందుకే వారాబందీ విధానం అమలు చేస్తున్నామని వివరించారు. కేఎల్‌ఐ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో పంపులను నడిపేందుకు చర్చలు చేపట్టామని తెలిపారు. అంతకుముందు పెంట్లవెల్లి మండలంల జటప్రోల్‌లో పర్యటించిన ఆయన మదనగోపాల స్వామి ఆలయం వద్ద యువకులతో కలిసి కాసేపు క్రికెట్‌ ఆడాడు.

పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి

పాలమూరు: జిల్లాలో అన్ని రకాల వయసు కలిగిన చిన్నారులకు సకాలంలో టీకాలు క్రమం తప్పకుండా అందించడంలో నిర్లక్ష్యం చేయరాదని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీనివాసులు సిబ్బందికి సూచించారు. భూత్పూర్‌ సబ్‌ సెంటర్‌తో పాటు మణికొండ పీహెచ్‌సీలను బుధవారం డీఎంహెచ్‌ఓ వ్యాక్సినేషన్‌ను తనిఖీలు చేశారు. ఓపీ రికార్డులు, ఫార్మసీ, వ్యాక్సిన్‌ నిల్వలు, రికార్డులు పరిశీలించారు. వ్యాధి నిరోధక టీకాల ప్రాముఖ్యతను ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. ఇమ్యూనైజేషన్‌ చేసిన వెంటనే యూ–విన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. పీహెచ్‌సీలలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాల్సిన అవశ్యకత ఉందన్నారు. డాక్టర్‌ పులివిద్య, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శరత్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement