అక్రమాలకు ఏఐ చెక్‌.. | - | Sakshi
Sakshi News home page

అక్రమాలకు ఏఐ చెక్‌..

Sep 28 2026 12:29 AM | Updated on Sep 28 2026 12:29 AM

వీబీజీరాంజీ (ఉపాధి) పనులపై పటిష్ట నిఘా

నాలుగు గంటలు పనిచేయాలి..

హాజరు నిలిపివేత..

● సీఎం స్వంత మండలం నుంచే మొదలైన పోరుబాట

● పాలమూరును ఆగం చేయొద్దని

జేఏసీ ఆధ్వర్యంలో కదిలిన రైతాంగం

● సంఘీభావం తెలిపిన ఎంపీ డీకే అరుణ,

ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొ.హరగోపాల్‌

ఎఫ్‌టీఎల్‌ పరిధిలో మొరం పోసి చదును చేసిన దృశ్యం

ఉత్సాహంగా ఉల్లాస్‌ పరీక్ష

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: మెప్మా ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని 91 కేంద్రాల్లో సెల్ప్‌హెల్ప్‌ గ్రూప్‌ (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు రెండో విడత ఉల్లాస్‌ పరీక్ష నిర్వహించారు. దీనికి మొత్తం 2,436 మందికి గాను 2,343 మంది హాజరు కాగా.. పరీక్షలను ఆర్పీలు పర్యవేక్షించారు. వివిధ కారణాలతో గైర్హాజరైన 93 మందికి వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే పరీక్షకు హాజరుకావొచ్చని ఇన్‌చార్జ్‌ డీఎంసీ లక్ష్మి తెలిపారు. అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు.

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ఇక నుంచి ఉపాధి పనుల్లో అక్రమాలకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో చెక్‌ పడనుంది. ఏఐ వినియోగంతో పనులు చేయకుండా తప్పుడు బిల్లులు పెట్టడం, పనికి వచ్చినా పనిచేయకుండానే ఫొటోలు దిగి వెళ్లే వారి ఆటలు ఇక సాగవు. వీబీజీ రాంజీ పథకంలో ఏఐ వినియోగాన్ని ఇప్పటికే తీసుకురావడంతో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటీవల జరిగిన పనులపై జరిగిన సామాజిక తనిఖీల్లో పనులు చేయకున్నా చేసినట్లుగా నమోదు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తప్పుడు బిల్లులు పెట్టడం, పనులు ఎక్కువగా నమోదు చేయడాన్ని తనిఖీ బృందం గుర్తించినట్లు తెలిసింది. ఉపాధి పనులు చేయకుండానే చేశామని ఫొటోలు దిగి వెళ్లే వారికి, బోగస్‌ పనులకు అడ్డుకట్ట పడుతుంది. ఉపాధి పనులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఏడాది పనులపై సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. తప్పుగా నమోదు చేసిన తర్వాత తనిఖీల్లో గుర్తించడం కంటే వెంటనే గుర్తించేందుకు సాంకేతికను వినియోగిస్తున్నారు. జూలై 1 నుంచి వీబీజీరాంజీ పథకంలో అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బోగస్‌ పనులను నిరోధించి, నిజాయితీగా చేసిన కూలీలనే గుర్తించేలా ఏఐను ప్రవేశపెట్టడంతో పనులు పారదర్శకంగా జరగనున్నాయి.

వారిపై నేరుగా విచారణ..

డిజిటల్‌ కొలతలు, ఏఐ రిపోర్టులకు భిన్నంగా మస్టర్‌ బుక్‌ రాసే అధికారులపై నేరుగా విచారణ జరగనుంది. ఇస్రో భువన్‌ పోర్టల్‌ శాటిలైట్‌ చిత్రాలతోపాటు ప్రతి అంబుడ్స్‌మెన్‌కు డ్రోన్‌ నిఘా వ్యవస్థను కేటాయించారు. సిబ్బంది కార్యాలయాల్లో కూర్చొని తప్పుడు బిల్లులు రాస్తే శాటిలైట్‌, డ్రోన్‌ డేటాలోని వాస్తవ కొలతలతో సరి తూగదు. తేడా వస్తే సదరు సిబ్బంది ఐడీలు నిలిచిపోవడమే కాకుండా రికవరీతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదవుతాయి. కూలీలు రాకపోయినా వారి పాత ఫొటోలను వేరే మొబైల్‌ స్క్రీన్‌పై చూపిస్తూ రీ ఫొటోలు తీసి మోసం చేసే ఫీల్డ్‌ ట్రిక్స్‌ను ఏఐ పట్టేస్తుంది.

మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం అప్పాయిపల్లిలో పాంపాండ్‌ పనులు చేస్తున్న కూలీలు

కొలతలు సరిపోకున్నా కఠిన చర్యలు

పని చేయకుండా ఫొటోలు దిగి

వెళ్తే అంతే..

కచ్చితంగా 4 గంటలు

పనిచేయాల్సిందే

ఏమాత్రం తేడా వచ్చినా హాజరు

నిలిపివేత

ఉపాధి కార్మికులు ప్రతిఒక్కరు నాలుగు గంటలు పనిచేయాలి. అలాగే చేసే పనిలో పురోగతి ఉండాలి. ఉదయం రాగానే చేసే పని దగ్గర ఫొటో దిగాలి. తర్వాత చేసిన పని దగ్గర ఫొటో దిగాలి. అలాగే చేసిన పనికి సంబంధించిన ఫొటో సైతం తీసి అప్‌లోడ్‌ చేయాలి. వీబీజీ రాంజీ సర్వర్‌ ద్వారా పనులను ఏఐ పరిశీలిస్తుంది. అన్నీ సక్రమంగా ఉంటేనే హాజరు పడుతుంది.

– నర్సింహులు, డీఆర్‌డీఓ

గ్రామాల్లో కొందరు కూలీలు, మేసీ్త్రలు కలిసి చేేసే తప్పులను అధికారులు గుర్తించారు. ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి ఫొటోలు దిగి వెళ్లిపోవడం, మధ్యలో అసలు పనే చేయకపోవడం వంటి మోసాలు జరిగేవి. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన వ్యవస్థతో పని జరగకపోతే ఏఐ ఆటో రిజెక్ట్‌ చేస్తుంది. ప్రతిఒక్కరు నాలుగు గంటల పాటు పని చేయాలి. దీని ప్రకారం ఉదయం, మధ్యాహ్నం తీసిన ఫొటోలను క్లౌడ్‌ సర్వర్‌లోని ఏఐ సాఫ్ట్‌వేర్‌ సెక్షన్లలో పోల్చి చూస్తుంది. ఉదయం ఉన్న మట్టి కుప్ప లేదా కాల్వ మధ్యాహ్నం ఫొటోలో కూడా ఎలాంటి మార్పు లేకుండా ఉంటే పనిలో పురోగతి లేదని, అక్కడ పని జరగలేదని గుర్తించి ఆ రోజు హాజరును ఆటోమేటిక్‌గా నిలిపివేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement