కుంట.. కబ్జా | - | Sakshi
Sakshi News home page

కుంట.. కబ్జా

Sep 28 2026 12:29 AM | Updated on Sep 28 2026 12:29 AM

ఈటవాయికుంట ఎఫ్‌టీఎల్‌ పరిధిలో మట్టితో పూడ్చివేత స్వరూపమే మారుతోంది.. స్పందించడం లేదు.. కుంటను పరిశీలిస్తాం.. 2.20 ఎకరాలు..

ఈటవాయికుంట ఎఫ్‌టీఎల్‌ పరిధిలో మట్టితో పూడ్చివేత

● తెరముందు పట్టాదారు..

తెరవెనుక అధికారుల మౌనం

● నీటి ప్రవాహానికి అడ్డంకులు..

ఆయకట్టుకు తీవ్రనష్టం

● ఫిర్యాదు చేసినా క్షేత్రస్థాయికి రాని

ఇరిగేషన్‌ అధికారులు

● రాజకీయ అండతోనే అక్రమం సాగుతోందని రైతుల ఆగ్రహం

–8లో u

●

ఈటవాయికుంట ఎఫ్‌టీఎల్‌ పరిధిలో మట్టి పోస్తుండటంతో కుంట విస్తీర్ణం, నీటి నిల్వ సామర్థ్యం తగ్గే పరిస్థితి ఉంది. వర్షపు నీరు సహజంగా కుంటలోకి చేరే మార్గాలకు కూడా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కుంటలోకి వర్షపు నీరు చేరితే పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. కుంటలో మట్టి పోస్తే నీటి నిల్వ తగ్గిపోతుంది. దీన్ని ప్రభావం మా పంటలపై పడుతుంది. ఎఫ్‌టీఎల్‌ పరిధి ఎంత వరకు ఉందో అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి సర్వే చేసి స్పష్టంగా గుర్తించాలి.

– ఈట శేఖర్‌, ఆయకట్టు రైతు

కుంటలో మట్టి పోస్తున్న విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా ఇప్పటి వరకు స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. కుంటలో మట్టి పోసి పూడ్చేస్తే నీటి నిల్వ తగ్గి రాబోయే రోజుల్లో సాగుకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించకపోవడం బాధాకరం. కలెక్టర్‌ జోక్యం చేసుకుని కుంటను పూర్తిస్థాయిలో పరిరక్షించాలి.

– విజయ్‌కుమార్‌, కార్యదర్శి, ప్రాథమిక మత్స్య సహకార సంఘం

ఈటవాయికుంట ఎఫ్‌టీఎల్‌ పరిధిని మట్టితో పూడుస్తున్నారన్న విషయం మా దృష్టికి వస్తే క్షేత్రస్థాయిలో ఇదివరకే పరిశీలించాం. కుంటకు సంబంధించిన రికార్డులు, ఎఫ్‌టీఎల్‌ హద్దులను పరిశీలించి మట్టితో పూడ్చిన ప్రాంతం ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందా.. లేదా.. అనేది నిర్ధారిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా మట్టితో పూడ్చినట్లు తేలితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం.

– ఆసిఫ్‌, ఇరిగేషన్‌ ఏఈ

మహబూబ్‌నగర్‌ రూరల్‌: చెరువులు, కుంటల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నా.. కోడూరు గ్రామ శివారులోని ఈటవాయికుంటకు మాత్రం రక్షణ కరువైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుంట ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని భూమిలో భారీగా మట్టి పోసి చదును చేస్తున్నా.. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు స్పందించడం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి పోతతో కుంటలోకి చేరాల్సిన వర్షపు నీటి సహజ ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి.. నీటి నిల్వ సామర్థ్యం తగ్గి ఆయకట్టు సాగు, భూగర్భజలాల పెంపుపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాపోతున్నారు. రాజకీయ పలుకుబడితోనే అధికారులు మౌనం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై కలెక్టర్‌ అయినా జోక్యం చేసుకుని ఎఫ్‌టీఎల్‌ హద్దులను తేల్చి కుంటను పరిరక్షించాలని కోరుతున్నారు.

కోడూరు గ్రామ శివారులోని ఈటవాయికుంటకు సంబంధించిన సర్వే నంబర్లు 29, 30, 451లో సుమారు 2.20 ఎకరాల భూమి ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందని రైతులు చెబుతున్నారు. అయితే కుంటకు ఆనుకుని ఉన్న భూమిని కొనుగోలు చేసిన ఓ పట్టాదారు అక్కడ మట్టిని పోసి భూమిని చదును చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మట్టి పోత కొనసాగితే కుంట విస్తీర్ణం క్రమంగా తగ్గడంతోపాటు వర్షపు నీరు నిల్వ ఉండే సామర్థ్యం తగ్గిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుంటలోకి చేరే వర్షపు నీరు సహజ ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడితే దాని ప్రభావం నేరుగా ఆయకట్టుపై పడుతుందని రైతులు చెబుతున్నారు. కుంటలో నీరు నిల్వ ఉండటం వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగి బోర్లు, బావులకు నీటి లభ్యత మెరుగుపడుతుందని.. కుంట పూడిపోతే ఈ ప్రయోజనం దెబ్బతింటుందని వాపోతున్నారు. వర్షాలు కురిసిన సమయంలో నీటి ప్రవాహానికి మార్గం లేక పొలాల్లోకి నీరు చేరినా.. కుంటలోకి చేరాల్సిన నీరు అడ్డంకులకు గురైనా పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈటవాయికుంట వ్యవహారంపై కలెక్టర్‌ ప్రత్యేకంగా దృష్టిసారించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కోడూరు శివారులోని

ఈటవాయికుంట

ఎఫ్‌టీఎల్‌ పరిధిలో మట్టి పోస్తున్నారని ఫిర్యాదులు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకపోవడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్‌ శాఖ ఏఈ, డిప్యూటీ ఈఈ, ఈఈ స్థాయి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా స్పందన లేదని చెబుతున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement