పిల్లలకు నైపుణ్య విద్య అందించాలి | - | Sakshi
Sakshi News home page

పిల్లలకు నైపుణ్య విద్య అందించాలి

Sep 26 2026 1:26 AM | Updated on Sep 26 2026 1:26 AM

పాలమూరు: భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కొనేలా పిల్లలకు సాధారణ విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే విద్యను అందించాలని ప్రభు త్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఏఐ, ఆటోమేషన్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో వేగంగా మార్పులు చోటుచేసు కుంటున్నాయని తెలిపారు. శుక్రవారం నగరంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐ యుగానికి అనుగుణంగా విద్యార్థులకు ఉపయోగపడే విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఒకే ప్రాంగణంలో సమగ్ర విద్య అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పాఠశాలలు, ఇంటర్‌, డిగ్రీ కళాశాలల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. బాలికల జూనియర్‌ కళాశాల అభివృద్ధికి రూ.6.86 కోట్లతో భవన నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎంవీఎస్‌ జూనియర్‌ కళాశాల భవనానికి రూ.7.95 కోట్లు, ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల సమగ్ర అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల 60వ వార్షికోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తామని వెల్లడించారు. పీయూలో ఇంజినీరింగ్‌, లా కళాశాల భవనాల నిర్మాణ పను లు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. వీరన్నపేటలో రెండు మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. టాటా టెక్నాలజీస్‌ భాగస్వామ్యంతో సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు, ఐటీఐలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల ద్వారా యువతకు ఆధునిక నైపుణ్యాలు అందించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌ యాదవ్‌, డిప్యూటీ మేయర్‌ సురేందర్‌రెడ్డి, ఎన్‌పీ వెంకటేష్‌, మల్లు నర్సింహారెడ్డి, సీజే బెనహర్‌ పాల్గొన్నారు.

ఏఐ, ఆటోమేషన్‌తో ఉద్యోగ రంగంలో వేగవంతమైన మార్పులు

నగర విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement