రైతులకు నీరందించకపోతే పోరాటాలు ఉధృతం | - | Sakshi
Sakshi News home page

రైతులకు నీరందించకపోతే పోరాటాలు ఉధృతం

Sep 23 2026 12:55 AM | Updated on Sep 23 2026 12:55 AM

భూత్పూర్‌: జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా రైతులకు నీరందించకపోతే రైతుల పక్షా న పోరాటాలను ఉధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి జూరాల ప్రాజె క్టు వైపు వెళ్తున్న ఆయనను భూత్పూర్‌ పోలీసులు అరెస్టు చేసి, సొంత పూచీకత్తుపై విడుద ల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటలు సాగు చేయరాదని ముందుగానే వ్యవసాయశాఖ గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు. అయితే రైతులు పంటలు సాగు చేసి ఎకరాకు సుమారు రూ.30 వేల వరకు ఖర్చు చేసిన తర్వాత ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.సాగర్‌, ఆర్‌.వెంకట్రాములు, విజయ్‌కుమార్‌, కిల్లె గోపాల్‌, నల్లవెల్లి కురుమూర్తి, వి.కురుమూర్తి, దీప్లా నాయక్‌, చంద్రకాంత్‌, ప్రశాంత్‌, రాజ్‌కుమార్‌ ఉన్నారు.

పాలమూరులో అమెరికా స్థాయి విజ్ఞాన కేంద్రం

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌లో నిర్మిస్తున్న పూలే–అంబేద్కర్‌ విజ్ఞాన కేంద్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా జార్జియాలోని గ్విన్నెట్‌, పుల్టన్‌ కౌంటీ పబ్లిక్‌ లైబ్రరీలను సందర్శించి అక్కడి డిజిటల్‌ లెర్నింగ్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, పఠన విభాగాలను పరిశీలించారు. వాటి తరహాలోనే విజ్ఞాన కేంద్రంలో అత్యాధునిక విద్యా సౌకర్యా లు, పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులోకి తెచ్చి తెలంగాణకే ఆదర్శంగా నిలుపుతామని పేర్కొన్నారు.

అంతరాయం లేకుండా

తాగునీటి సరఫరా చేయాలి

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి వెబెక్స్‌ ద్వారా మిషన్‌ భగీరథ గ్రిడ్‌, ఇంట్రా విభాగాల ఈఈలు, డీఈలు, ఏఈలతో సమీక్షించారు. తాగునీటి సరఫరా, పైపులైన్ల నిర్వహణ, లీకేజీల పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన అన్ని పైపులైన్లను క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా పైపులైన్లలో లీకేజీలు గుర్తించిన వెంటనే మరమ్మతులు చేపట్టి, నీటి వృథాను అరికట్టాలని ఆదేశించారు.తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తిన ప్రాంతాలను గుర్తించి, వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు.

శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలి: ఎస్పీ

జడ్చర్ల: శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలతో మమే కం కావాలని ఎస్పీ జానకి పోలీసు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జడ్చర్ల పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె.. స్టేషన్‌ పనితీరు, పెండింగ్‌ కేసులు, దర్యాప్తు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. పెండింగ్‌ కేసులను వేగంగా పరిష్కరించి నిర్ణీత సమయంలో చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సూచించారు. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడా లని ఆదేశించారు. శోభాయాత్ర మార్గాలను ముందుగానే పరిశీలించి ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలని, నిమజ్జన ప్రదేశాల్లో లైటింగ్‌, బారికేడ్లు, క్రేన్‌ వంటి సౌకర్యాలను పరిశీలించాలన్నారు. డీజేలకు అనుమతి లేదని, బీట్‌ పెట్రోలింగ్‌, వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. సీఐ కమలాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement