రోడ్డు ప్రమాదంలో బైక్‌ మెకానిక్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బైక్‌ మెకానిక్‌ దుర్మరణం

Sep 20 2026 1:03 AM | Updated on Sep 20 2026 1:03 AM

భూత్పూర్‌: కారు, మోటార్‌ సైకిల్‌ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని కొత్త మొల్గర వద్ద శనివారం చోటుచేసుకుంది. మద్దిగట్ల సర్పంచ్‌ సురేష్‌, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుండుమాల త్రినాథ్‌ (20)మహబూబ్‌నగర్‌లో బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. శనివారం స్వగ్రామం నుంచి బైక్‌పై మహబూబ్‌నగర్‌ వెళ్తుండగా కొత్త మొల్గర సమీపంలోని తుల్జాభవాని తండా వద్ద ఎదురుగా భూత్పూర్‌ నుంచి నాగర్‌కర్నూల్‌ వైపు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో త్రినాథ్‌ తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మృతిచెందాడు. భూత్పూర్‌ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి గతంలోనే మరణించగా.. తండ్రి గుండుమాల శంకర్‌, సోదరుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement