నెరవేరిన ఎన్నో ఏళ్ల రైతుల కల | - | Sakshi
Sakshi News home page

నెరవేరిన ఎన్నో ఏళ్ల రైతుల కల

Sep 20 2026 1:03 AM | Updated on Sep 20 2026 1:03 AM

ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి,

రాజేష్‌రెడ్డి

మంగనూరు–కమాలోద్దీన్‌పూర్‌

9ఆర్‌ కాల్వ పనులకు శంకుస్థాపన

భూత్పూర్‌/తిమ్మాజిపేట: కేఎల్‌ఐ నుంచి మండలంలోని ఎల్కిచర్ల, మద్దిగట్ల, పాతమొల్గర, కప్పెటతోపాటు తిమ్మాజిపేట మండలం చేగుంట రైతుల పొలాలకు సాగునీరందించే లక్ష్యంతో చేపట్టిన కాల్వ ఎన్నో ఏళ్ల రైతుల కల నెరవేరే దిశగా కీలక అడుగు పడిందని ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, రాజేష్‌రెడ్డి పేర్కొన్నారు. దేవరకద్ర, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాలకు శివారు గ్రామమైన చేగుంట గేట్‌ వద్ద మంగనూరు నుంచి కమాలోద్దీన్‌పూర్‌ 9ఆర్‌ మైనర్‌ కాల్వ పనులకు ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు. భవిష్యత్‌ తరాలకు మేలు జరగాలనే ఆలోచనలతో భూములు ఇవ్వడానికి ముందుకొచ్చిన రైతుల సహకారం అభినందనీయమని, మరువకుండా ఎల్లప్పుడు గుర్తుంచుకుటామని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా పబ్లిక్‌ నోటిఫికెషన్‌ జారీ చేసి, సంబంధిత ప్రక్రియ పూర్తయిన అనంతరమే కాల్వ పనులకు శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. కాలువ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం రావాల్సిన పరిహారం రెండు నెలల్లోగా అందేలా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. దేవరకద్ర నియోజకవర్గానికి సాగునీరందించేందుకు కృషిచేసిన నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ డిప్యూటీ మేయర్‌ సురేందర్‌రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ నగర డిఫ్యూటీ మేయర్‌ సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కదిరె శేఖర్‌రెడ్డి, ఎల్కిచర్ల సర్పంచ్‌ రమేష్‌, నాయకులు సుదర్శన్‌రెడ్డి, ఎల్కిచర్ల, చేగుంట రైతులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement