పీయూ పీజీ కళాశాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పీయూ పీజీ కళాశాల తనిఖీ

Sep 17 2026 1:50 AM | Updated on Sep 17 2026 1:50 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీజీ కళాశాలలోని పలు డిపార్ట్‌మెంట్‌లను వీసీ శ్రీనివాస్‌ బుధవారం ఉదయం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతం, అటెండెన్స్‌ రిజిస్ట్రర్లు, అకాడమిక్‌ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు, అధ్యాపకులు సమయపాలన పాటించాలని, అటెండెన్స్‌ రిజిస్ట్రర్‌లను అప్‌డేట్‌ చేయాలని సూచించారు. అనంతరంతో ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు కొద్దిసేపు తరగతులు బోధించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ మధుసూదన్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆడిటోరియం

నిర్మాణానికి రూ.కోటి మంజూరు

పీయూలో ఆడిటోరియం నిర్మించేందుకు రూ. 10 కోట్లు ఇస్తామని కాన్వకేషన్‌ సందర్భంగా ఎంఎస్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మొదటి దశ రూ.కోటి మంజూరు చేసినట్లు అధికారులు పేర్కన్నారు. ఈ మేరకు ఈ నిధులతో పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

వ్యక్తి రిమాండ్‌

నవాబుపేట: బాలికను ప్రేమపేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ నరేందర్‌ తెలిపారు. బుధవారం మండలంలో ఒక గ్రామానికి చెందిన మైనర్‌ను అదే గ్రామానికి చెందిన నర్సింహులు ప్రేమ పేరుతో వెంటపడి వేధిస్తున్నట్లు బాధితురాలు తండ్రి ఫిర్యాదుతో కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement