పెద్దవాగులో ఇసుకాసురులు | - | Sakshi
Sakshi News home page

పెద్దవాగులో ఇసుకాసురులు

Aug 22 2026 12:53 AM | Updated on Aug 22 2026 12:53 AM

వర్నె వద్ద ఇసుక అక్రమ రవాణా

రాత్రిళ్లు ట్రాక్టర్లతో డంప్‌..

టిప్పర్లతో తరలింపు

పొన్నకల్‌ వద్ద కూడా ఇదే దందా..

అడ్డాకుల: మండలంలో విస్తరించి ఉన్న పెద్దవాగును అక్రమార్కులు చెరబట్టారు. రాత్రయిందంటే చాలు ఇసుక అక్రమ తవ్వకాలకు తెర తీస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా వాగులోంచి ఇసుకను బయటకు తెచ్చి వాగు పరిసరాల్లోనే డంప్‌ చేస్తున్నారు. తర్వాత భారీ టిప్పర్లకు ఇసుకను నింపి సొమ్ము చేసుకుంటున్నారు. వర్నె వద్ద ఇటీవల అక్రమ ఇసుక తవ్వకాలు మొదలు పెట్టారు. కొందరు అఽధికార పార్టీ నేతలు రాత్రిపూట యంత్రాలను ఉపయోగించి ఇసుకను ట్రాక్టర్లతో తెచ్చి వాగు సమీసంలోనే నిల్వ చేస్తున్నారు. ఇక్కడ భారీ టిప్పర్లలో ఇసుకను లోడ్‌ చేస్తున్నారు. మూడురోజుల కిందట పెద్ద ఎత్తున ఇదేరీతిలో ఇసుక అక్రమ రవాణా జరిగింది. తాజాగా గురువారం రాత్రి మరోసారి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడ్డారు. పెద్ద టిప్పర్లలో ఇసుకను తరలించినట్లు స్థానిక రైతులు తెలిపారు. డంప్‌ చేసిన వెంటనే ఇసుక నిల్వలు కనిపించకుండా అదేరాత్రి అక్కడి నుంచి ఇసుకను తరలిస్తుండటంతో దందా పగలు బయటకు కనిపించడంలేదు. ఇక్కడ తవ్వే ఇసుకను వనపర్తి, భూత్పూర్‌, మహబూబ్‌నగర్‌ వంటి ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే వర్నె, కన్మనూర్‌, ముత్యాలంపల్లి నుంచి రాత్రిపూట ట్రాక్లర్లతో ఇసుకను ఇతర ప్రాంతాలకు యథేశ్ఛగా తరలిస్తున్నారు.

పొన్నకల్‌ వద్ద ఇదే..!

పొన్నకల్‌ సమీపంలో ఉన్న ఇదేవాగులో ఇటీవల అక్రమార్కులు బరి తెగించారు. రాత్రివేళ ట్రాక్టర్లతో ఇసుకను డంపింగ్‌ చేయడం.. వెంటనే టిప్పర్లలో ఇసుక నింపి పంపడం చేస్తున్నారు. రాత్రికి వెలిసే డంపులు ఉదయం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడ రెండువర్గాలకు పొసగక ఇటీవల రెండు ట్రాక్టర్లను కొందరు గ్రామస్తులు పోలీసులకు పట్టించినట్లు తెలిసింది. డంపులు చేయడం.. రాత్రికి రాత్రే దాన్ని లేపేయడం ఇసుక మాఫియాకు ఈజీగా మారింది. ఒరరోజు అక్రమ రవాణాకు పాల్పడితే మరుసటి రోజు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పెద్దవాగులో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని తెలిసినా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే ఆక్రమార్కులకు కూడా కలిసిస్తోంది.

గురువారం రాత్రి వర్నె వద్ద వాగు పక్కనే ఇసుకను డంప్‌ చేసి తరలించింది ఇక్కడే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement