● 25 తులాల బంగారం,
186 తులాల వెండి స్వాధీనం
● నిందితుడి అరెస్టు..
రిమాండ్‌కు తరలింపు
కందనూలు: తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందుతుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ అశోక్‌రెడ్డి శుక్రవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశఽంలో తెలిపారు. పూర్తి వివరాలు.. బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లికి చెందిన కాసరి శివకుమార్(23) కరెంటు, మేసీ్త్ర పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మూడేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బులతో చెడు అలవాట్లకు బానిసయ్యాడు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా పెట్టుకొని ఇనుపరాడ్డు, గడ్డపారతో బీరువా, ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శాయిన్‌పల్లిలో ఐదు, మమ్మాయిపల్లి గ్రామంలో రెండు ఇళ్లలో చోరీలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద 25.1 తులాల బంగారం, 186 తులాల వెండి, మొబైల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 40 లక్షల వరకు ఉంటుందన్నారు. దొంగతనం చేసిన వెండిలో 32 తులాలు తన అవసరాలకు వాడుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ శంషోద్దిన్, పీసీ భీముడు, హోంగార్డులు రమేష్, శివను సీఐ అభినందించారు.


