ఎస్సార్‌నగర్‌లో కర్ణాటక మద్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

ఎస్సార్‌నగర్‌లో కర్ణాటక మద్యం పట్టివేత

Aug 22 2026 12:53 AM | Updated on Aug 22 2026 12:53 AM

అమీర్‌పేట: ఎస్‌ఆర్‌నగర్‌లో రూ.1.50 లక్షలు విలువ చేసే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రీమియం మద్యంను ఎకై ్సజ్‌ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అమీర్‌పేట ఎకై ్సజ్‌ పోలీసులు ఎస్‌ఆర్‌నగర్‌ ఉమేష్‌ చంద్ర విగ్రహం చౌరస్తాలో అనుమానాస్పదంగా కనిపించిన కె.గోవర్ధన్‌రెడ్డి (46) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా అతడి వద్ద కర్ణాటకకు చెందిన 4 ప్రీమియం మద్యం బాటిళ్లు ఉన్న ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం మీర్‌పేటలోని అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి మరో 55 మద్యం బాటిళ్లు సీజ్‌ చేశారు. వివిధ రకాల బ్రాండ్ల కర్ణాటక ప్రీమియం మద్యంతో పాటు డిఫెన్స్‌ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి డిఫెన్స్‌ మద్యం బాటిళ్లను తక్కువ ధరకు తెచ్చి రూ.300 నుంచి రూ.500 లాభానికి నగరంలో అమ్ముతున్నట్లు విచారణలో వెల్లడించాడు. గోవర్ధన్‌రెడ్డి స్వగ్రామం వనపర్తి కొల్లాపూర్‌కు చెందిన వాడని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ బానోత్‌ పటేల్‌ తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్‌ సిబ్బంది వాణి, రాధా, రవి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement