జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని జిల్లాలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగా సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జరుగుతున్న ప్రక్రి యలో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 21 మంది, నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి 21 మంది, వనపర్తి జి ల్లా నుంచి 14 మంది, గద్వాల జిల్లా నుంచి 14 మంది, నారాయణపేట జిల్లా నుంచి 14 మంది అభ్యర్థులు కలిపి మొత్తం 84 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఈ ప్రక్రియను జిల్లా ఎస్పీ డి.జానకి పరిశీలించారు. అభ్య ర్థుల సర్టిఫికెట్ల పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియను పరిశీలించి ఎలాంటి తప్పులు జరగకుండా సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఏఓరుక్మిణీ భాయ్, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్, అశోక్ కుమార్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


