ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈమేరకు సోమవారం 10 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్లద్వారా 234 మెగావాట్లు, 62.279 ఎంయూ, దిగువలో 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు, 47. 282 మిలియన్ యూనిట్ల విద్యుదు త్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 109.561 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు. ప్రస్తుతం 43 వేల క్యూసెక్కులను వినియోగించి దిగువ శ్రీశైలంకు వదులుతున్నామని తెలిపారు.


