సంస్కృతి, సంప్రదాయబద్ధంగా జరుపుకొంటున్న గిరిజన యువతులు
● తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో
గోధుమనారుకు పూజలు
● నియమ, నిష్టలు, ఆటాపాటలతో సందడి
● చివరిరోజు చెరువులు, కుంటల్లో
నిమజ్జనం
తీజ్‌ను గిరిజనులు తొమ్మిది రోజులపాటు ఆయా రోజుల్లో యువతులు రొట్టెలు, ఆకుకూరలు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. బుట్టలు ఎందరు ఉంచినా అందులో ఐదుగురు యువతులు మాత్రమే నిష్టతో పూజ చేస్తారు. చివరిరోజు యువతులు మొలకల బుట్టతను తలపై పెట్టుకొని చెరువు వద్దకు వెళ్తారు. అప్పటికే అక్కడ సంప్రదాయయపద్ధతిలో రూమాలాలు తలకు చుట్టుకొని పెద్దమనుషులు కూర్చుంటారు. యువతలు బుట్టల్లోని కొన్ని మొలకలను తలపాగాల్లో వేస్తారు. అనంతరం బుట్టలకు పూజలు చేసి చెరువులోకి వదులతారు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత పెద్దమనుషుల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు. యువతలను కూడా పీటలపై కూర్చొబెట్టి పెద్దమనుషులు వారి కాళ్లు కడిగి ఆశీర్వదిస్తారు.
అచ్చంపేట: లంబాడ గిరిజనుల(బంజారాలు) సంప్రదాయ మొలుకల పండుగను నల్లమలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కఠోర నియమాలు, డప్పుల మోతలు.. తండావాసుల కేరింతలు.. పెళ్లికాని ఆడబిడ్డల ఆటాపాటలు.. అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాలు.. భక్తిభావం వీటి మేళవింపే తొమ్మిది రోజుల(నవ దాడేరి తీజ్) పండుగ. ఆషాఢం, శ్రావణమాసంలో బంజారాలు తీజ్ వేడుకలను తమ సంస్కృతిని ప్రతిభింబిచేలా జిల్లావ్యాప్తంగా ఈ పండుగను నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ గ్రామాలు, తండాలు, పట్టణాల్లో తీజ్ సందడి నెలకొంది. శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మాహరాజ్ (సేవాభాయి) శ్రీశ్రీశ్రీ దండి మేరమ్మ(అమ్మవారు) తల్లికి పూజలు చేసే క్రమంలో ఈ తీజ్ వేడుకలను నిర్వహిస్తారు. పెళ్లికాని యువతులు తమకు మంచి వరడు లభించాలని, తండావాసులు తమ పాడి పశువులు, పిల్లాపాపలు చల్లగా ఉండాలని వేడు కుంటూ తొమ్మది రోజులపాటు తీజ్‌ను జరుపుకొంటారు. ఒకప్పుడు తండాల్లో జరిగే ఈ వేడుకలు ఇప్పుడు పట్టాలకు విస్తరించాయి. ఇప్పటికే అచ్చంపేట మండలం ఐనోలు, లింగాల, కల్వకుర్తి మండలాల్లో తీజ్ వేడుకలు కొనసాగుతుండగా.. కొన్ని తండాల్లో ముగిశాయి.
పెళ్లికాని యువతుల చేత..
పెళ్లికాని యువతులు రేగిచెట్టుకు ప్రత్యేక పూజలు చేసి తీజ్‌ను ప్రారంభిస్తారు. అంతకుముందే తండాల్లోని పెద్దలు ప్రతిఇంటి నుంచి గోధుమలు సేకరించి రోజంతా నీళ్లలో నానబెడుతారు. పెళ్లికాని యువతులు చిన్నచిన్న వెదురు బుట్టలో పుట్టమన్ను(మకొడధూడ్) గోవు పిడకల చూర్ణాన్ని కలిి ప నాయక్(పూజారి)ఇంటికి తీసుకురాగా నాయక్ భార్య ఆ బుట్టలో నానబెట్టిన గోధుమలు వేసి అలుకుతుంది. అనంతరం పూజలు చేసి బుట్టలను డాగ్డో(మంచె)పై ఉంచి తొమ్మిది రోజులపాటు ప్రత్యేక జలాలు చల్లుతూ ఉత్సవాలు నిర్వహిస్తారు.
పులియోగెనో..
తీజ్‌లో ముఖ్యమైనది పులియోగెనోది. దీనిని బంజార మహిళలు స్వయంగా తయారు చేస్తారు. అద్దాలు, గవ్వలు, పూసలతో చూడముచ్చటగా తయారు చేయడానికి తమ స్థోమతను బట్టి రూ.2వేల వరకు ఖర్చు చేస్తారు. గోధుమలు మొలకెత్తడానికి పవిత్ర జలాలు పోసే సమయంలో తీజ్ నిర్వహించేటప్పుడు దీనిని వినియోగిస్తారు. యువతలు కలశాలతో జలాలు తీసుకొచ్చేటప్పుడు తలపై పెట్టుకునే దానిని గెనో అని రెండు కలశాలపై కప్పుకుని వచ్చే దానిని పులియా అన్ని వ్యవరిస్తారు. పెళ్లి సమయంలో దీనిని పెళ్లికూతురుకు తమ గుర్తుగా తల్లిదండ్రులు అందిస్తారు. గిరిజనుల సంప్రదాయం, సంస్కృతికి పులియోగెనో అతి ముఖ్యమైంది.
పీడియా..
తీజ్ ముగింపు ఉత్సవాల్లో పాల్గొనే పెళ్లికాని యువతులు వచ్చే ఏడాది తాము తీజ్ అడుతామో లేదోననే ఆందోళన కనిపిస్తోంది. అంతకుముందు గ్రామంలో పెళ్లికాని గిరిజన యువకులు చేతుల్లో పట్టుకునే పీడీయాను ప్రయత్నాలు చేస్తూ విడిపిస్తారు. అయితే పీడీయా పట్టుకున్న వ్యక్తి ఇంటిపేరు, విడిపించే యువతుల ఇంటిపేర్లు ఒక్కటి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.


