మక్తల్: నియోజకవర్గంలో అభివృద్ధికి తనవంతు కృషి చేసి తెలంగాణలో మక్తల్ చరిత్రను తిరగా రాస్తానని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం మక్తల్‌లో అగ్నిమాపక భవనం నిర్మాణం కోసం రూ.2కోట్లు మంజూరు చేసి పనులకు ప్రాంభించారు. అనంరతం మొక్కుల నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల భద్రతకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అవసరమైన ప్రాంతాల్లో అగ్రిమాపక కేంద్రాలను బలోపేతం చేస్తున్నామన్నారు. గతంలో అగ్నిమాపక కేంద్రం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆరునెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు అదేశించారు. మక్తల్ నియోజకవర్గం అభివృద్ధికి ఏమాత్రం వెనుకాడటంలేదని, అందరు సహకరిస్తే కృషిచేస్తానన్నారు. మక్తల్‌లో 220 విద్యుత్ కేవీ సబ్‌స్టేషన్ త్వరల్లో తీసుకోస్తామని వెల్లడించారు. అనంతరం మంత్రిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, స్పెషల్ అధికారి బాలజీ, ఏఈ మల్లికార్జున్, జీవీ ప్రసాద్, నరేస్‌గౌడ్, రహీంపటేల్, మహేశ్, శంషోద్దిన్, అమరేందర్‌రెడ్డి, వాకిటి హన్మంతు, గోవర్ధన్, రవికుమార్ పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి


