మద్యానికి గుడ్‌బై | - | Sakshi
Sakshi News home page

మద్యానికి గుడ్‌బై

Aug 16 2026 5:33 AM | Updated on Aug 16 2026 5:33 AM

స్వాతంత్య్ర దినోత్సవం వేళ గ్రామ సర్పంచ్‌ కీలక నిర్ణయం

బెల్ట్‌ షాపుల మూసివేతకు శ్రీకారం.. ఊరంతా మద్దతు

మహబూబ్‌నగర్‌ రూరల్‌: స్వాతంత్య్ర దినోత్సవ వేళ రామచంద్రాపూర్‌ గ్రామం మద్యపానానికి వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలో బెల్ట్‌ షాపులను మూసివేసి మద్యపానాన్ని నియంత్రించాలని సర్పంచ్‌ వై.నర్సిములు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి గ్రామస్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు. శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర వేడుకల్లో సర్పంచ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మద్యపాన నిషేధానికి గ్రామస్తులు మద్దుతు తెలిపారు. కాగా.. మద్యపానంతో కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్న నేపథ్యంలో నిషేధానికి సహకరించాలని కోరుతూ శుక్రవారం రాత్రి గ్రామంలో దండోరా వేయించారు. గ్రామంలో మద్యం విక్రయాలు జరగకుండా ప్రజలు సహకరించాలని సూచించారు.

ఎకై ్సజ్‌ సహకారం అవసరం

బెల్ట్‌ షాపులను పూర్తిగా నియంత్రించాలంటే ఎకై ్సజ్‌ శాఖ సహకారం అవసరమని గ్రామస్థులు పేర్కొంటున్నారు. అధికారిక వైన్‌షాప్‌ నుంచే మద్యం విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటే గ్రామంలో అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడ్డారు. సర్పంచ్‌, మహిళా సంఘాల నిర్ణయం అమలుకు అధికారులు సహకరించాలని కోరుతున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ కేశవానంద్‌, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, వివిధ పార్టీల నాయకులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement