తాడూరు: మహిళ దారుణ హత్యకు గురైన ఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తెలకపల్లి మండలం రాకొండకు చెందిన బంగారమ్మ(43) అదే మండలం వట్టిపల్లికి చెందిన భర్త కృష్ణయ్యను కొన్నాళ్ల కాపురం అనంతరం 15ఏళ్ల కిందట వదిలేసి సొంతూరులో నివాసముంటుంది. మండల కేంద్రానికి చెందిన భీమయ్యతో కొంతకాలంగా పరిచయమైంది. డబ్బుల విషయంలో బంగారమ్మ తాడూరుకు చేరుకుని తనకు ఇవ్వాల్సిన రూ.7వేలు ఇవ్వాలని భీమయ్యను తన పొలంలో నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో బొలేరోకు అడ్డు నిలువగా.. భీమయ్య కోపంతో బంగారమ్మను ఢీకొట్టగా.. కిందపడిపోయిన అక్కడిక్కడే మృతిచెందింది. ఘటన భీమయ్య పొలంలో జరగడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ రాములు పరిశీలించి మృతదేహాన్ని నాగర్‌కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆలయ సమీపంలోమృతదేహం లభ్యం
జడ్చర్ల: పట్టణంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి(40) మృతిచెందాడు. బ్లూ జీన్స్ ప్యాంటు కాఫీకలర్ షర్ట్ చేతికి కడియం ధరించి ఉన్నాడు. ఆలయం సమీపంలోని ఎస్సీ కమ్యూనిటీ భవనం ప్రహరీ పక్కన మృతదేహం పడి ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు మతదేహాన్ని జడ్చర్ల ఆస్పత్రిలోని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


