కేంద్రంలో ప్రజానుకూల మార్పు రావాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్రంలో ప్రజానుకూల మార్పు రావాలి

Aug 7 2026 1:56 AM | Updated on Aug 7 2026 1:56 AM

ఉండవెల్లి: దేఽశంలో ప్రజలకు మేలు జరగాలంటే.. కేంద్రంలో ప్రజానుకూల మార్పు రావాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ నాయకురాలు సురవరం విజయలక్ష్మి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక, కార్పోరేట్‌ అనుకూల మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రలో భాగంగా.. కంచుపాడులో జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువులు రోజురోజుకు ఆకాశానంటుతుండడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ధరల పెరుగుదలను వెంటనే నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 1న సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించే చల్లో ఢిల్లీ కార్యక్రమానికి కార్మిక, రైతు, ఉద్యోగ, నిరుద్యోగులు, ప్రజలు అధి కంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సోషల్‌ మీడియా ఇన్‌చార్జి సురవరం కపిల్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, నాయకులు రవి, నాగార్జున, రంగన్న, ఆశన్న, భరత్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement