● కబడ్డీలో ‘పాలమూరు’ ప్రతిభ
● రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తున్న క్రీడాకారులు
● భారత్ జట్టు తరఫున ఆడడమే లక్ష్యం నిరంతర ప్రాక్టీస్
జిల్లాలోని చిన్నచింత
కుంట మండలం
పర్దిపూర్‌కు చెం దిన కె.భవాని నాలుగేళ్ల నుంచి కబడ్డీ ఆడుతోంది. జట్టు లో ఆల్‌రౌండర్‌గా ప్రతిభ కనబరుస్తోంది. ఇప్పటివరకు ఆరు రాష్ట్రస్థాయి టోర్నీల్లో
జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించింది. 2025లో హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ఆడింది. కబడ్డీలో మెరుగైన ప్రదర్శన కనబరిచి భవిష్యత్‌లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించమే తన లక్ష్యం అంటోంది భవాని.
పది రాష్ట్రస్థాయి పోటీల్లో మౌనిక
జిల్లాలోని రాజాపూర్‌కు చెందిన జె.మౌనిక మూడేళ్ల నుంచి కబడ్డీలో ప్రతిభ కనబరుస్తోంది. పది రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా కబడ్డీ పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించింది. గత ఏడాది హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన అండర్–19 ఎస్‌జీఎఫ్ జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు తరపున ఆడింది. ప్రతి రోజు కబడ్డీ ప్రాక్టిస్ చేస్తున్న, రానున్న రోజుల్లో జూనియర్, సీనియర్ నేషనల్ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తానంటోంది మౌనిక.


