జడ్చర్ల మండలం నాగసాలకు చెందిన హేమంత్‌యాదవ్ కబడ్డీలో ప్రతిభ చాటుతున్నాడు. నాలుగుసార్లు రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా కబడ్డీ పోటీల్లో జిల్లా తరపున ఆడాడు. ఈ ఏడాది జనవరిలో విజయవాడలో జరిగిన జూనియర్ నేషనల్ కబడ్డీ పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించాడు. గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన యువ తెలంగాణ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పాల్గొని రజత పతకం సాధించాడు. పాలమూరు యూనివర్సిటీ తరపున ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడు. భవిష్యత్తులో ప్రోకబడ్డీ లీగ్‌కు ఎంపిక కావడం కోసం నిరంతరం కబడ్డీ ప్రాక్టీస్ చేస్తున్నానని అంటున్నాడు హేమంత్ యాదవ్.


