మక్తల్: పట్టణంలోని జాతీయ రహదారికి సమీపంలో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలను అధికారులు గురువారం తొలగించారు. కొందరు తప్పుడు ధ్రువపత్రాలతో రూ. కోట్లు విలువ చేసే భూమిని ఆక్రమించుకొని దుకాణాలు వేసుకునేందుకు అద్దెకు ఇచ్చారు. ఈక్రమంలో తహసీల్దార్ సతీశ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజయ్య, ఎస్‌ఐ రాజు ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా ఏర్పాటు చేసుకున్న డబ్బాలను జేసీబీతో తొలగించే చర్యలు చేపట్టారు. దీంతో కొందరు తాము పట్టా సర్టిఫికెట్లు తీసుకున్నట్లు చెప్పి వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో ఎస్‌ఐ రాజు రంగప్రవేశం చేసి దుకాణాదారులను అక్కడి నుంచి పంపించి వేశారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుంటే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు.


