రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Aug 7 2026 1:56 AM | Updated on Aug 7 2026 1:56 AM

మరికల్‌: ద్విచక్రవాహనా లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఒకరు మృతి చెంది న ఘటన బుధవారం అర్ధ రాత్రి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని తీలేర్‌కు చెందిన బొ డి ఆశప్ప (46) బైక్‌పై దేవరకద్ర నుంచి తీలేర్‌కు వస్తున్న క్రమంలో ముందు వెళ్తున్న బైక్‌ను వేగంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్లేవారు గమనించి చికిత్స నిమిత్తం అంబులైన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండడంతో పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదంపై మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్‌ఐ గాయిత్రి తెలిపారు.

సిలిండర్‌ లీకేజీ

మహిళకు తీవ్ర గాయాలు

పాన్‌గల్‌: ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయ్యి మహిళకు తీవ్ర గాయాలైన ఘటన గురువారం మండలంలోని చిక్కేపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వార్డు స భ్యురాలు రేణుక ఉదయం ఇంట్లో వంట చేసేందుకు స్టవ్‌ ఆన్‌ చేయగా ఒక్కసారిగా సిలిండర్‌ రెగ్యూలేటర్‌ నుంచి మంటలు చెలరేగి చీరకు అంటుకుంది. దీంతో మహిళ ముఖం, చేతులు, శరీరానికి తీవ్రగాయాలయ్యాయి. పక్క గదిలో ఉన్న కుటుంబ సభ్యులు వెంటనే గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి అంబులెన్స్‌లో జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించా రు. ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామాగ్రి, బీరు వా కాలిపోగా, ఇంటి గోడలు నెర్రలు ఇచ్చా యి. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ కార్తీక్‌ రావు, ఎస్‌ఐ కుర్మయ్య గ్రామానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

బైక్‌ అదుపుతప్పి..

జేసీబీ ఆపరేటర్‌ మృతి

గోపాల్‌పేట:పని ముగించుకుని ఇంటికి వస్తుండగా వరాహం అడ్డువచ్చి ద్విచక్రవాహనం అదుపుతప్పి జేసీబీ ఆపరేటర్‌ మృతి చెందిన ఘటన జ యన్న తిర్మలాపూర్‌ గ్రా మ సమీపంలో బుధ వారం రాత్రి చోటు చేసుకున్నది. ఎస్సై శశిధర్‌ తెలిపిన వివరాల మేరకు.. తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన మండ్ల ఆంజనేయులు వనపర్తిలో జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి తన ద్విచక్రవాహనంపై తొమ్మిదిన్నర ప్రాంతంలో సొంతగ్రామానికి వెళ్తున్నాడు. తిర్మలాపూర్‌ సమీపంలోని సబ్‌స్టేషన్‌ వద్ద వరాహం అడ్డుగా రావడంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మృతుడి భార్య యాదమ్మ గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శశిధర్‌ తెలిపారు.

మద్యం మత్తులో

పర్యాటకుల దాష్టీకం

టూరిజం సిబ్బందిపై దాడి

కొల్లాపూర్‌ రూరల్‌: మండలంలోని సోమశి ల సందర్శనకు వచ్చిన పలువురు పర్యాటకులు టూరిజం సిబ్బందిపై అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఎస్‌ఐ ఆనంద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌, ఆమనగల్‌, వనపర్తి ప్రాంతాలకు చెందిన అశోక్‌, సందీప్‌, అక్షయ, సంధ్యతో పాటు ఓ మైనర్‌ ఒకే కారులో మంగళవారం అర్ధరాత్రి సోమశిల సందర్శనకు వచ్చారు. ఈ క్రమంలో వీఐపీ ఘాట్‌ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతూ మద్యం తాగారు. అక్కడ సెక్యూరిటీగా ఉన్న బాలస్వామి, శివకుమార్‌, దేవరాజు వారిని ఇక్కడ మద్యం తాగొద్దని మందలించారు. దీంతో తాగిన మైకంలో ఐదుగురు పర్యాటకులు దేవరాజుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మిగతా సిబ్బంది గమనించి బాధితుడిని కొల్లాపూర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. సిబ్బంది బాలస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై జిల్లా పర్యాటక శాఖ అధికారి నరసింహ్మ స్పందించారు. పర్యాటక శాఖ ఉద్యోగులపై టూరిస్టులు భౌతికంగా దాడులు చేస్తే సంహించమన్నారు. సోమశిలలో సిబ్బందిపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement