మహమ్మదాబాద్: నేటి సమాజంలో యువతలో ఎక్కువగా జరుగుతున్న సైబర్‌నేరాలు, రోడ్డుభద్రతపై పోలీసుల పరిధిలో అవగాహన కల్పించాలని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్‌హెచ్ చౌహాన్ పేర్కొన్నారు. బుధవారం మహమ్మదాబాద్ పోలీస్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సైబర్‌నేరాలు, రోడ్డు ప్రమాదాలు పెచ్చుపెరిగిపోతున్న ఈ సమయంలో ముఖ్యంగా యువతకు తగిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్టేషన్‌కు వచ్చిన కేసులను ఎప్పటికప్పుడు పరిశీలించి ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. ప్రతిఫర్యాదును వెంటనే నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకో వాలని తెలిపారు. మహిళలకు చిన్నారుల కేసులకు ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు. రాత్రివేళలో బీట్ వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. అవినీతి నిర్లక్ష్యానికి తావులేదన్నారు. పోలీస్టేషన్‌కు వస్తే న్యాయం జరుగుతుందని ప్రజలు గ్రహించాలని అలాంటి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. పోలీస్టేషన్ల పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయని ఎలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని రికార్డులను చూశారు. సివిల్ కేసుల్లో ఎక్కువగా తలదూర్చవద్దని అలాంటి కేసులు కోర్టుల పరిధిలో తేల్చుకుంటారని పేర్కొన్నారు. ఈయన వెంట రూరల్ సీఐ గాంధీనాయక్, మహమ్మదాబాద్ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి, పోలీస్టేషన్ సిబ్బంది ఉన్నారు.


