తప్పుడు ప్రయోజనాలుంటే పదవికి రాజీనామా చేస్తా | - | Sakshi
Sakshi News home page

తప్పుడు ప్రయోజనాలుంటే పదవికి రాజీనామా చేస్తా

Jul 30 2026 5:00 AM | Updated on Jul 30 2026 5:00 AM

యూనివర్సిటీ ప్రయోజనాల

కోసం కృషి : వీసీ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూ ప్రయోజనాలను నష్టం చేస్తే పదవి నుంచి తప్పుకుంటా నని పీయూ వీసీ శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బందితో పాటు పాలమూరు జిల్లా సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. నేషనల్‌ సెమినార్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమానికి వస్తున్న క్రమంలో ఇక్కడి వసతులు సరిపోవని, వారు వచ్చేందుకు హైదరాబా ద్‌ నుంచి దూరం అవుతుందన్నారు. వారు తప్పకుండా సెమినార్‌కు రావాలన్న ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేశామని, ఇందులో ఎలాంటి ప్రయోజనాలు లేవని పేర్కొన్నారు. ఏవైనా తప్పుడు ప్రయోజనాలు ఉంటే తన పదవికి రాజీనామా చేస్తానని రాజీనామా లెటర్‌ను చూపించారు. కేవ లం యూనివర్సిటీకి మంచి పేరు కోసం కృషి చేస్తున్న తనపై తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. సెమినార్‌ ప్రారంభం నుంచి విద్యార్థి సంఘాల కోరిక మేరకు ఒక్కరోజు ఇక్క డ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, కన్హాశాంతి వనంలో కార్యక్రమం ఏర్పాటు చేసే అంశాన్ని పూర్తిగా కమిటీకి అప్పగించామని, వారి నిర్ణయం మేరకు మాత్రమే అక్కడ నిర్వహించాల ని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో పాలమూరు పునఃనిర్మాణ ఫోరం అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, జేపీఎన్‌సీ కళాశాల చైర్మన్‌ రవికుమార్‌, వామన్‌కుమార్‌ అధికారులతో మాట్లాడుతున్న క్రమంలో ఉద్దేశ పూర్వకంగా సెమినార్‌ను కన్హాశాంతి వనానికి మార్చారని, ఎటువంటి పరిస్థితి లో అక్కడ నిర్వహించవద్దని, నిర్వహించేందుకు డబ్బులు లేకపోతే తాము డబ్బులు ఇస్తామని హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొనడం చర్చనీయాశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement