బాలికలదే హవా | - | Sakshi
Sakshi News home page

బాలికలదే హవా

Apr 13 2026 7:56 AM | Updated on Apr 13 2026 7:56 AM

మంచి ఫలితాలు సాధించాం..

ఇంటర్‌ ఫలితాలు విడుదల

20వ తేదీ వరకు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌...

మహబూబ్‌నగర్‌

గతేడాదితో పోలిస్తే మెరుగుపడని జిల్లా ఫలితాలు

‘ద్వితీయం’లో ఉత్తీర్ణత పెరిగినా.. ‘ప్రథమం’లో తగ్గింది

రాష్ట్రస్థాయిలో ఫస్టియర్‌లో 16, సెకండియర్‌లో 17వ స్థానం

రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ దరఖాస్తులకు

20 వరకు అవకాశం

ఈకో టూరిజం అభివృద్ధి..

కేంద్ర పర్యాటక, రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో నల్లమలలో ఈకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్‌టీసీఏ తెలిపింది.

సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

–8లో u

మహబూబ్‌నర్‌ ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించలేదు. గతేడాదితో పోలిస్తే ఫస్టియర్‌లో ఉత్తీర్ణత శాతం 0.60శాతం తగ్గగా.. సెకండియర్‌లో 3.06శాతం పెరిగింది. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో ఎప్పటిలాగే పాలమూరు జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్రస్థాయిలో గతేడాది ప్రథమ సంవత్సరం జనరల్‌ కోర్సుల్లో 10 స్థానంలో నిలవగా ఈ ఏడాది 16వ స్థానం, సెకండియర్‌ జనరల్‌ కోర్సుల్లో గతేడాది 12వ స్థానంలో నిలవగా ఈ సారి 17వ స్థానం దక్కింది. గత నెల జిల్లా వ్యాప్తంగా జరిగిన ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలను ప్రభుత్వం ఆదివారం ఉదయం 11గంటలకు విడుదల చేసింది. ఈమేరకు ఫలతితాలను పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు మోబైల్‌ ఫోన్‌లు, ఇంటర్నెట్‌ సెంటర్‌ల వద్ద మార్కెలను లిస్టును డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే గత సంవత్సంతో పోల్చితే జనరల్‌ కోర్సుల్లో రెండు సంవత్సరాల్లో కూడా పెద్దగా ఉత్తీర్ణత శాతంలో మెరుగుదల కనిపించకపోవడం విశేషం. గతేడాది మొదటి సంవత్సరం జనరల్‌ కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం 62.78శాతంగా ఉంటే ఈ ఏడాది 62,18 శాతంగా నమోదైంది. సెకండియర్‌లో గతేడాది 69.59శాతం ఉత్తీర్ణత ఉండగా.. ఈ సారి 72.65శాతంతో కాస్త మెరుగుదల కనిపించింది. కాగా.. ఒకేషనల్‌ కోర్సుల్లోనూ బాలికలదే అత్యధిక ఉత్తీర్ణత సాధించండం విశేషం.

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. రాష్ట్రస్థాయిలో ప్రై వేటు కళాశాలలకు ధీటుగా ఫలితాలు సాధించారు. సప్లిమెంటరీ, రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి.

– కౌసర్‌ జహాన్‌, డీఐఈఓ

పరీక్షల ఫలితాల అనంతరం రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తులను విద్యార్థులు ఈనెల 13 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రీకౌంటింగ్‌కు ఒక్కో పేపర్‌ రూ.100 చొప్పున చెల్లించాలని, రీ వెరిఫికేషన్‌కు రూ.800లను చెల్లించాలని అధికారులు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు ఈ నెల 20వ తేదీ వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిఇంటర్మీడియట్‌ బోర్డు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement