జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న పీస్‌రేట్ కార్మికులకు జీఓ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని విద్యుత్ ఎంప్లాయిస్ ఆర్టిజన్ల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కి డిమాండ్ చేశారు. ఆర్టిజన్ల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న ధర్నా ఆదివారం ఐదో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల్లో 2016 డిసెంబర్ 4వ తేదీ కంటే ముందు అన్ని అర్హతలు ఉండి పనిచేస్తూ ఇప్పటికీ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్‌గా గుర్తించాలన్నారు. విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్ల డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం దిగి రావాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ చైర్మన్ పెండయ్య, తిరులమలేష్, సైదులు, మోయిజ్, శ్రీనివాసులు, శేఖర్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.


