గంజాయి ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి ముఠా అరెస్టు

Mar 20 2026 9:38 AM | Updated on Mar 20 2026 9:38 AM

160 గ్రాముల గంజాయి స్వాధీనం

అమ్రాబాద్‌: మండల కేంద్రంలో గంజాయి అమ్ముతున్న ముఠాను బుధవారం రాత్రి అమ్రాబాద్‌ ఎస్‌ఐ హన్మంత్‌రెడ్డి చాకచక్యంగా పట్టుకున్నారు. వీరిలో ఒకరు పరారు కాగా మిగతా ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్‌ఐ హన్మంత్‌రెడ్డి గురువారం విలేకరులకు వివరించారు. అమ్రాబాద్‌కు చెందిన నోము ల అభిగౌడ్‌ హైదరాబాద్‌ నుంచి గంజాయిని తెచ్చి అధిక దరకు అమ్రాబాద్‌లో అమ్ముతుండేవాడు. ఈ క్రమంలో ముందస్తు సమాచారం మేరకు నిఘా పెట్టి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడిలో అభి గౌడ్‌ పరారు కాగా అమ్రాబాద్‌ కు చెందిన సయ్యద్‌, లక్ష్మాపూర్‌(బీకే)తండాకు చెందిన కొర్రవిక్రమ్‌, కొర్ర శ్రీకాంత్‌, కొర్రపవన్‌, మాదవానిపల్లి గ్రామానికి చెందిన చంద్రకంటి అనిల్‌ పట్టుబడ్డారు. సీఐ శంకర్‌నాయక్‌ ఆదేశాలతో వారిని విచారించి రిమాండ్‌కు తరలించామన్నారు. కాగా నిందితుల్లో ఇద్దరు విద్యార్థులు ఉండటం గమనార్హం. అయితే నిందితులు పట్టుబడిన రోజే పదర మండలం వంకేశ్వరంలో నేనావత్‌ తిరుపతి వ్యవసాయ పొలంలో పదహారు గంజాయి మొక్కలను ఎకై ్సజ్‌ అధికారులు గుర్తించి ధ్వంసం చేయడంతో పాటు 180 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement