వంగూరు: అమెరికా లోని అట్లాంటలో స్థిరపడ్డ నాగర్‌కర్నూల్ జిల్లా డిండి చింతపల్లికి చెందిన ఇందుర్తి బాలకిష్టారెడ్డికి న్యూజెర్సీలోని ఎడిసన్ టౌన్‌షిప్ అసాధారణ నాయకత్వం, మానవతావాది పురస్కారం లభించింది. సమాజంలో ఏకత్వాన్ని పెంపొందించే దిశగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల నిర్వహణకు గుర్తింపునిస్తూ నూజెర్సీ సెనెట్ అభినందించింది. శంకర్ నేత్రాలయంలో అనేక కీలక పదవులు నిర్వహించిన బాలకిష్టారెడ్డి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అంధత్వ నివారణకు విశేష కృషిచేశారు. ఆర్‌అండ్‌బీ శాఖలో ఈఎన్‌సీగా పనిచేసిన గణపతిరెడ్డి సోదరుడే బాలకిష్టారెడ్డి.


