స్వర్ణాభరణ అలంకరణలో వెంకన్న | - | Sakshi
Sakshi News home page

స్వర్ణాభరణ అలంకరణలో వెంకన్న

Mar 20 2026 9:38 AM | Updated on Mar 20 2026 9:38 AM

మన్యంకొండలో వైభవంగా

ఉగాది సంబరాలు

భక్తిశ్రద్ధలతో పంచాంగ శ్రవణం

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం ఉగాది సంబురాలను ఘనంగా నిర్వ హించారు. ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని నూతన వస్త్రధారణ, బంగారు అభరణాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు, అర్చన లు చేశారు. అనంతరం స్వామివారిని పల్లకీలో గర్భగుడి నుంచి హనుమద్దాసుల మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి హారతి సమర్పించారు. రకరకాల పూలు, స్వర్ణాభరణ అలంకరణలో స్వామి వారు భక్తకోటికి దర్శనమిచ్చారు. అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి సన్నిధిలో పూజలు చేసి తరించారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు దేవస్థానం వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు.

ఘనంగా సుదర్శన పేరుమాళ్ల పల్లకీ సేవ..

ఉగాది పండుగ సందర్భంగా దేవస్థానంలో స్వామివారి సుదర్శన పేరుమాళ్ల పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సుదర్శన పేరుమాళ్లను గర్భగుడి నుంచి గుండం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తు ల హరినామచరణ మధ్య స్వామి వారి పల్లకి సే వ ముందుకు కదిలింది. అనంతరం గుండం వద్ద ఆరగింపు తదితర పూజలు చేశా రు. తిరిగి పల్లకీలో స్వామివారి సు దర్శన పేరుమాళ్లను ఊరేగింపుగా గర్భగుడి వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ అళ హరి మధుసూదన్‌కుమార్‌, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్‌ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

27 వరకు స్వర్ణాభరణ అలంకరణ

మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామివారు స్వర్ణాభరణ అలంకరణలో ఈ నెల 27, శ్రీరామనవమి వరకు భక్తులకు దర్శనమిస్తారు. విశేషోత్సవాల్లో మాత్రమే స్వామివారికి స్వర్ణాభరణ అలంకరణ చేస్తారు. దీంతో స్వామివారు నిత్యం వివిధ రకాల అభరణాల మధ్య భక్తులకు దర్శనమిస్తారు.

సంగమేశ్వరాలయంలో ఉగాది పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement