నిప్పంటుకొని ఇల్లు దగ్ధం
కోస్గి రూరల్: ప్రమాదవశాత్తు కచ్చా ఇంటికి నిప్పు అంటుకొని పూర్తిగా ఇళ్లు దగ్ధమైన ఘటన మున్సిపాలిటీలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. మున్సిపాలిటీ పరిధిలోని సంపల్లి గ్రామానికి చెందిన కథల మొగులయ్య భార్య సత్యమ్మతో కలిసి శుక్రవారం ఉదయం మేసీ్త్ర పనికి వెళ్లగా ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్ళారు. మధ్మాహ్న సమయంలో ఇంటి నుంచి దట్టంగా పొగలు రావడంతో స్థానికులు పోలీసుల, కొడంగల్ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్పటికే ఇళ్లు పూర్తిగా కాలిపోవడంతో ఇంట్లో ఉన్నా వంటసామగ్రితో పాటు వస్తువులు బూడిదయ్యాయి. సిలిండర్ పేలక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. పైరింజన్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకోచ్చారు. రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి వంటపాత్రలు రెవెన్యూ అధికారులు అందజేశారు.


