రోడ్డుపై వాయు విద్యుదుత్పత్తి
నారాయణపేట లిటిల్ స్టార్స్ స్కూల్ విద్యార్థులు నిరోనిక, సాయిచరణ్ రోడ్డుపై వెళ్తున్న వాహనాల వేగానికి వీచే గాలి నుంచి విద్యుదుత్పత్తి చేసే పరికరాన్ని ప్రదర్శించారు. రోడ్డుకు మధ్యలో ఫ్యాన్ రెక్కలతో కూడిన స్తంభాలను (టర్బన్) ఏర్పాటు చేయడం వలన వాహన వేగానికి వచ్చే గాలి ద్వారా వాయు విద్యుదుత్పత్తి అయి ట్రాన్స్‌ఫార్మర్‌కు చేరుతుంది. ప్రతి ఇంటిపైన దీనిని అమర్చడం వల్ల ఎలక్ట్రిసిటీని ఆదా చేయవచ్చు. ఇంధన రహితంగా వాహనాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌ను ఆదా చేయవచ్చు.
రోడ్డుపై వాయు విద్యుదుత్పత్తి


