సాంకేతికతతో పిల్లలపై దృష్టి
దామరగిద్ద సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు అనిల్‌నాయక్, రవినాయక్ సెల్‌ఫోన్ ప్రభావంతో పిల్లలు చెడు మార్గంలోకి వెళ్లకుండా సాంకేతికత పరిజ్ఞానంతో తల్లిదండ్రులు కట్టడి చేసే ప్రాజెక్టును ఆవిష్కరించారు. ఫోన్‌లో జీపీఎస్ అమర్చడం వలన అవతలి వ్యక్తి ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు వారి పిల్లలను ఉన్నత విద్య అభ్యసించడం కోసం సుదూర ప్రాంతాలకు పంపించినప్పుడు ఇలాంటి జీపీఎస్ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుంది. దొంగలు అపహరించిన ఫోన్ పట్టుకోవచ్చు.


