మన్యంకొండ.. భక్తులే నిండ
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం గురువారం భక్తజన సందోహంతో పులకించింది. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు. ముందుగా కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకొన్నారు. ఉదయం 7 నుంచే భక్తులు ప్రధాన ముఖద్వారం నుంచి గర్భాలయం వరకు దర్శనానికి బారులు తీరారు. దేవస్థానంతో పాటు పక్కనున్న శివాలయం, కొండ దిగువనున్న అలివేలు మంగతాయారు ఆలయంలో భక్తులు పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఛైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు అన్ని ఏర్పాట్లు చేశారు.


