జోగుళాంబ క్షేత్రం.. భక్తజన సంద్రం
● నూతన సంవత్సర వేళ.. ఆలయాలకు భారీగా తరలివచ్చిన భక్తులు
● వాహనాల రద్దీతో ఇబ్బందులు
కురుమూర్తి గిరులు కిటకిట..
చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురంలో ఉన్న కురుమూర్తిస్వామి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. అర్చకులు ఉదయాన్నే ఆలయాన్ని శుద్ధిచేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచే స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అలంపూర్: నూతన సంవత్సరం మొదటిరోజు గురువారం జోగుళాంబ క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయాల ఆవరణ కిటకిటలాడింది. క్షేత్రానికి వచ్చిన భక్తులు క్యూలైన్‌లలో బారులుతీరి జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడంతో పాటు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తుల వాహనాల రాకపోలతో ప్రధాన రహదారులు రద్దీగా మారి ట్రాఫిక్ సమస్య తలెత్తగా పోలీసులు నియంత్రించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అలంపూర్ చౌరస్తా నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి బస్సు కొరత వేధించింది.
జోగుళాంబ క్షేత్రం.. భక్తజన సంద్రం
జోగుళాంబ క్షేత్రం.. భక్తజన సంద్రం


