పనిలోనూ ‘నూతనో’త్సాహమే..
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అంటూ కూలీలు సైతం నూతన
సంవత్సర వేడుకులను ఘనంగా నిర్వహించుకున్నారు. వేడుక చేసుకోవాలనే ఉత్సాహం
ఉండాలే తప్పా.. దానికి డీజే శబ్దాలు, విసురుకోవడానికి రంగుల పేపర్లు, శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ప్లెక్సీలు ఉండాల్సిన అవసరం లేదని నిరూపించారు. గురువారం అడ్డాకుల మండలంలోని శాఖాపూర్ శివారులో రాఘవేందర్ వ్యవసాయ పొలంలో నాట్లు వేయడానికి
వెళ్లిన కూలీలు యూరియా బస్తానే టేబుల్‌గా ఉంచి కేక్ కట్ చేసి మహిళలు ఒకరికొకరు
తినిపించుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. – అడ్డాకుల


