మార్కెట్లోకి విటారా గ్లోరియస్
పాలమూరు: మారుతీ సుజుకి నెక్సా మెగా ఇన్‌ఫ్లుయెన్సర్ మహోత్సవం శనివారం నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్ హాజరై విటారా గ్లోరియస్ ఎడిషన్ కారును మార్కెట్‌లోకి ఆవిష్కరించారు. తర్వాత కస్టమర్ రెఫరల్ పథకాన్ని ప్రారంభించారు. నెక్సా సురిక్షతమైన అంశాలపై సేల్స్ మేనేజర్ చైతన్య వివరించారు. ఆ తర్వాత విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మేనేజర్లు తుకారాం, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


