ఉరేసుకొని మహిళ బలవన్మరణం
నవాబుపేట: ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని తీగలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల వెంకటమ్మకు చెందిన ఎకరా పొలాన్ని ఆమె దాయాదులు గతంలో పట్టా చేయించుకున్నారు. దీంతో నాటి నుంచి మనస్తాపంతో ఉన్న వెంకటమ్మ గురువారం పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భూమి కోల్పోయానన్న మనస్తాపంతోనే తన తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుమార్తె కృష్ణవేణి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
వెల్దండ: మండలంలోని ఉబ్బలగట్టుతండా జీపీ పరిధిలోని మల్లయ్య గుండుతండాలో వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. మల్లయ్యగుండు తండాకు చెందిన రాత్లావత్ రమేశ్‌నాయక్(35) గురువారం రాత్రి రోజువారీగా కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేశారు. చలికాలం కావడంతో భార్య సీత ఆరుబయట చుట్టుపక్కలవారితో చలిమంట వేసుకుంది. రాత్రి ఇంట్లోకి వెళ్లే సరికి రమేశ్‌నాయక్ ఉరివేసుకొని ఉన్నట్లు గుర్తించి కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వెళ్లి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే మృతిచెందాడు. శుక్రవారం సర్పంచులు కేస్యనాయ క్, మహిపాల్, ఆయా పార్టీల నాయకులు బా ధిత కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్యగౌడ్ మృతుడి కుటుంబానిక రూ.10వేల ఆర్థిక సాయం అందజేశా రు. మృతుడికి కుమారుడు శ్రీరామక్, కుమార్తె శ్రీలత ఉన్నారు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
మల్లేపల్లిలో యువకుడు..
రాజాపూర్: మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన నర్సింహ్మ (18) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లితో గొడవపడడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై రాజాపూర్ పోలీసులను సంప్రదించగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.
కంటైనర్ ఢీకొని
మహిళ దుర్మరణం
రాజాపూర్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ కంటైనర్ ఢీకొని మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని రంగారెడ్డిగూడ ఎక్స్‌రోడ్డులో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన ఎరుకలి మల్లమ్మ (49) గ్రామ సర్వీసు రోడ్డులో ఉన్న పాల కేంద్రంలో పాలు తీసుకొని నడుచుకుంటూ వెళ్తుండగా హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న ఏపీ 39వీసీ 4750 నంబర్ గల కంటైనర్ వెనుక నుంచి ఢీకొట్టింది. కంటైనర్ టైరు మల్లమ్మ పొట్టపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమార్తె అలివేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంటైనర్ డ్రైవర్ రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివానందంగౌడ్ తెలిపారు.
వ్యక్తి అనుమానాస్పద
మృతి
జడ్చర్ల: అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బండమీదిపల్లి సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. నవాబుపేట మండలంలోని కాకర్లపహడ్ గ్రామానికి చెందిన దండు స్వామి (28) మోటర్ బైక్‌పై జడ్చర్ల నుంచి కాకర్లపహడ్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బండమీదిపల్లి డబుల్‌బెడ్ రూం ఇళ్ల సమీపంలో రోడ్డు దాటుతున్న మరో బైక్‌ను ఓ పక్కగా ఢీకొట్టి రోడ్డు కిందకు పడిపోయాడు. బైక్‌పై ఉన్న స్వామి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతిచెందాడు. అయితే తన భర్త మరణంపై అనుమానం ఉందని, ప్రమాదానికి కారణమయిన వారే రాళ్లతో కొట్టి చంపి ఉంటారని మృతుడి భార్య లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
వంగూరు: మండలంలోని ఉల్పర సమీపంలోని దుందుబీ వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను శుక్రవారం తెల్లవారుజామున బ్లూకోర్ట్ సిబ్బంది పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి ట్రాక్టర్ యజమాని సత్యనారాయణపై కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు ఎస్‌ఐ మహేష్ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ అన్నారు.
ఉరేసుకొని మహిళ బలవన్మరణం


