భారీ వాహనాలు తిరగడంతోనే..
భారీ ఇసుక వాహనాలు తిరగడంతో మట్టిరోడ్డు కుంగి పక్కనే ఉన్న పైప్‌లైన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. వ్యాపారులు వారి స్వార్థం కోసం సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగించడం సరికాదు. ప్రస్తుతం అధికారులు ఏర్పాటు చేసుకున్న రోడ్డు పలు గ్రామాల వారికి సౌకర్యంగా ఉంది. అత్యవసర సమయాల్లో సులువుగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. వర్షాకాలంలో రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో అధికారులు తాత్కాలికం మరమ్మతులు చేశారు. అయినప్పటికీ మళ్లీ భారీ వాహనాలు అధికంగా తిరుగుతుండటంతో రోడ్డు గుంతలమయంగా మారింది.
– కోదంరాముడు, తుమ్మిళ్ల
●


