టీ–20 లీగ్ చాంపియన్ మహబూబ్‌నగర్
● కీలక మ్యాచ్‌లో నారాయణపేట
జట్టుపై విజయం
● రన్నరప్‌గా నిలిచిన నాగర్‌కర్నూల్ జట్టు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ చాంపియన్‌గా ఆతిథ్య మహబూబ్‌నగర్ జట్టు నిలిచింది. ఈ నెల 20న ప్రారంభమైన ఉమ్మడి జిల్లా టీ–20 లీగ్ శుక్రవారం ఉత్సాహంగా ముగిసింది. లీగ్‌లో ఉమ్మడి జిల్లాలో ని జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. లీగ్‌లో మూడు విజయాలు సాధించి నెట్‌రన్ రేట్ ప్రకారం మెరుగైన ప్రదర్శన కనబరిచిన మహబూబ్‌నగర్ జట్టు 6 పాయింట్లు సాధించి చాంపియన్‌గా, నాగర్‌కర్నూల్ జట్టు 6 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. కాకా మెమోరియల్ టీ–20 లీగ్‌లో రెండో రౌండ్‌లో పాల్గొనే 15 మందితో కూడిన ఉమ్మడి జిల్లా క్రీడాకారులను ఎంపికచేశారు.
51 పరుగుల తేడాతో నాగర్‌కర్నూల్ విజయం
లీగ్ మ్యాచ్‌లో నాగర్‌కర్నూల్ జట్టు 51 పరుగుల తేడాతో నారాయణపేట జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నాగర్‌కర్నూల్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. జట్టులో ఎన్.జశ్వంత్ 21 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు, అర్షద్ అహ్మద్ 23, రాంచరణ్ 20 పరుగులు చేశారు. నారాయణపేట బౌలర్లు అక్షయ్ 4 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు, అచ్యుత్‌రామ్ 2, మహ్మద్ జహీర్ 2 వికెట్లు, బాలాజీ ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నారాయణపేట జట్టు.. 19.4 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో ఆర్యన్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 42 పరుగులు, కె.భానుప్రసాద్ 20 పరుగులు చేశారు. నాగర్‌కర్నూల్ బౌలర్లు కేతేశ్వర్ 3.4 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా.. ఎన్.జశ్వంత్ 3, గగన్, జష్షు చెరో వికెట్ తీశారు. మ్యాన్ ఆప్‌ది మ్యాచ్‌గా ఎన్.జశ్వంత్ (నాగర్‌కర్నూల్) నిలిచారు.
మహబూబ్‌నగర్ జట్టు విజయం..
ఉమ్మడి జిల్లా టీ–20 చి వరి లీగ్ మ్యాచ్‌లో ఆతి థ్య మహబూబ్‌నగర్ జ ట్టు 10 వికెట్ల తేడాతో నారాయణపేట జట్టు పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసి న నారాయణపేట జట్టు.. నిర్ణీత 20 ఓవర్ల లో 9 వికెట్లు కో ల్పోయి 124 పరుగులు చేసింది. జట్టులో అక్షయ్ 30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌ల తో 45 పరుగులు చేయగా.. ఆర్యన్ 22 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్ బౌలర్లు మహ్మద్ షాదా బ్ అహ్మద్ 4 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 3 వికె ట్లు, డేవిడ్ క్రిపాల్ 2, యువన్ ముద్దనూరి 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహబూబ్ నగర్ జట్టు.. వికెట్ నష్టపోకుండా 12.4 ఓవర్లలో 126 పరుగులు చేసింది. డేవిడ్ క్రిపాల్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 67, అబ్దుల్ రాఫే 33 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన డేవిడ్ క్రిపాల్ (మహబూబ్‌నగర్) మ్యాన్ ఆప్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఉమ్మడి జిల్లా క్రికెటర్లు భారత జట్టుకు ఆడాలి
ఉమ్మడి జిల్లా క్రికెటర్లు భారత జట్టుకు ఆడాలని ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్ వి.మనోహర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా టీ–20 లీగ్‌లో విజేతగా నిలిచిన మహబూబ్‌నగర్, రెండోస్థానంలో నిలిచిన నాగర్‌కర్నూల్ జట్లకు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. కాగా, ఈ నెల 29 నుంచి జరిగే కాకా వెంకటస్వామి మెమోరియల్ రౌండ్ రౌండ్ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు పాల్గొంటుందని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. వచ్చే నెల 10, 11 తేదీల్లో మహబూబ్‌నగర్‌లోని మైదానంలో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టీఎన్‌జీవో మాజీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, కోచ్‌లు గోపాలకృష్ణ పాల్గొన్నారు. అంతకుముందు లీగ్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన కేతేశ్వర్ (నాగర్‌కర్నూల్)కు ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్ మెమోంటో అందజేశారు.
జిల్లా క్రికెట్ జట్టు: డేవిడ్ క్రిపాల్, ఎ.శ్రీకాంత్, అబ్దుల్ రాఫే, ముఖిత్, షాదాబ్, కె.శ్రీకాంత్, వెంకటచంద్ర (మహబూబ్‌నగర్), అచ్యుత్‌రామ్, ఆర్యన్, బి.అక్షయ్, అభిలాష్ (నారాయణపేట), ఎన్.జశ్వంత్, గగన్, జి.జశ్వంత్ (నాగర్‌కర్నూల్), అరవింద్ (గద్వాల).
టీ–20 లీగ్ చాంపియన్ మహబూబ్‌నగర్
టీ–20 లీగ్ చాంపియన్ మహబూబ్‌నగర్


