తీరు మారడం లేదు..
తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి ఆర్డీఎస్ కాల్వ వరకు పైప్‌లైన్ ఉంది. పైప్‌లైన్ పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న రహదారిపై సాధారణ వాహనాలు తిరిగితే ఏం కాదు. నల్లమట్టి కావడం, రోడ్డును అనుసరించి పైప్‌లైన్ ఉండటంతో భారీ వాహనాలు తిరిగితే పైప్‌లైన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని వాహనదారులకు పలుమార్లు తెలిపాం. గతంలో పచ్చర్ల వైపు రోడ్డుపై అడ్డుగా ముళ్ల కంచె ఏర్పాటు చేసినా తీరు మారలేదు. బీటీ రోడ్డు నిర్మాణానికిగాను ఉన్నతాధికారులకు విన్నవించాం.
– వరుణ్, ఏఈఈ, ఆర్డీఎస్
●


