సౌత్‌జోన్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నీకి కార్తీక్
మహబూబ్‌నగర్ క్రీడలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో వచ్చే నెల 3 నుంచి 6వ తేదీ వరకు జరిగే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు చిన్నచింతకుంట మండలం అల్లీపూర్‌కు చెందిన టి.కార్తీక్ ఎంపికయ్యాడు. ఈ నెల 20న పాలమూరు యూనివర్సిటీలో జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికల్లో కార్తీక్ ప్రతిభ కనబరిచి సౌత్‌జోన్‌కు ఎంపికయ్యాడు. అతడిని హైదరాబాద్‌లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, శాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి అభినందించి శాలువాతో సత్కరించి బ్యాడ్మింటన్ కిట్ అందజేశారు. సౌత్‌జోన్ పోటీల్లోనూ ప్రతిభ చాటి జిల్లా, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అల్లీపురం మాజీ సర్పంచ్ ఎం.రఘువర్ధన్‌గౌడ్, కౌకుంట్ల బీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


