చిల్లిగవ్వ లేదు..
గ్రామ పంచాయతీలో అభివృద్ధి పను లు చేపట్టేందుకు చిల్లిగవ్వ లేదు. గతంలో మాజీ సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు, కార్యదర్శులు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.లక్షల్లో బకాయిలు విడుదల కావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో సీఎం ప్రకటన కొంత ఊరటనిచ్చింది.
– స్వర్ణలత, సర్పంచ్, కోడూర్ గ్రామం, మహబూబ్‌నగర్ రూరల్ మండలం
అభివృద్ధికే వెచ్చిస్తాం..
ముఖ్యమంత్రి ఇస్తామన్న రూ.10 లక్షలతో కొంతైనా గ్రామాల అభివృద్ధికి అవకాశం లభిస్తుంది. ఇప్పటికై తే గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది వేతనాలు చెల్లించిన తర్వాత మిగులు నిధులను ప్రజల కనీస అవసరాలకు వినియోగిస్తాం. పారదర్శకంగా నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగిస్తాం.
– వెంకట్‌నాయక్, సర్పంచ్, రేగడిగడ్డతండా
●
చిల్లిగవ్వ లేదు..


