జాతీయ ‘గో గేమ్’లో క్రీడాకారుల ప్రతిభ
మహబూబ్‌నగర్ క్రీడలు: ఒడిశా రాష్ట్రంలోని పూరిజగన్నాథ్‌లో ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగిన జాతీయస్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ గోగేమ్ పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో క్రీడాకారులు మూడు బంగారు, మూడు రజత పతకాలు సాధించి సత్తాచాటారు. సింగిల్ విభాగం సబ్ జూనియర్‌లో సిటి.లలితేష్ (గద్వాల) బంగారు పతకం, మహ్మద్‌సోబానుర్దిన్ (మహబూబ్‌నగర్) రజత పతకం, జూనియర్‌లో పి.రాహుల్ (మహబూబ్‌నగర్) బంగారు పతకం, ఎం.చేతన్‌చంద్ర (మహబూబ్‌నగర్) రజత పతకం, సీనియర్‌లో పి.రాకేష్ (మహబూబ్‌నగర్) బంగారు పతకం, సబావత్ వర్షిత్ (నాగర్‌కర్నూల్) రజత పతకం కై వసం చేసుకున్నారు. క్రీడాకారులకు కోచ్‌గా తెలంగాణ రాష్ట్ర గోగేమ్ అసోసియేషన్ మహ్మద్ షకీల్ వ్యవహరించారు.


