ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్ రగ్బీ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్‌ఏ స్టేడియంలో మంగళవారం ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–19 విభాగాల రగ్బీ బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారబదాయి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మ డి జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. ఎంపికలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 100 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు.కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వేణుగోపాల్, జగన్‌మోహన్‌గౌడ్, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.


