మైనర్లకు వాహనాలిస్తే సీజ్ చేస్తాం
మహబూబ్‌నగర్ క్రైం: తల్లిదండ్రులు మైనర్లకు ఎ లాంటి పరిస్థితిలో వాహనాలు ఇవ్వరాదని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సీఐ ఇజాజుద్దీన్ ఆధ్వర్యంలో మంగళవా రం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. దీంట్లో మైనర్ డ్రై వింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారితోపాటు ర్యాష్ డ్రైవింగ్, త్రీబుల్ రైడింగ్ వంటి 35మంది వాహనదారులకు స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రధానంగా మైనర్లతోపాటు వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు ప్రతిఒక్క వాహనదారుడు పాటించాలన్నారు. భవిష్యత్‌లో మైనర్లు డ్రైవ్ చేస్తే వాహనాలు సీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.


