నవంబర్‌లోనే.. ముసుగేసింది
బల్మూరులో..
మానవపాడులో..
మానవపాడులో..
బాలానగర్‌లో..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను మంగళవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. ఎటు చూసినా మంచు దుప్పటి పరుచుకొని కనిపించింది. తెల్లవారుజామున మంచు దట్టంగా కురవడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. ఉదయం 8 గంటలైనా పొగమంచు తగ్గకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణించారు. రహదారులతోపాటు పంట పొలాలు ఊటీని తలపించాయి. ఉదయం వివిధ పనులకు వెళ్లే వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సాధారణంగా డిసెంబర్ ఆఖరు, జనవరిలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటుంది. కానీ, ఈసారి నవంబర్‌లోనే మంచు ముసుగేయడం చలి తీవ్రతను చాటుతోంది. – జడ్చర్లటౌన్/మానవపాడు/బల్మూర్
మానవపాడు రైల్వేస్టేషన్ వద్ద పొగమంచులో వస్తున్న రైలు
నవంబర్‌లోనే.. ముసుగేసింది
నవంబర్‌లోనే.. ముసుగేసింది
నవంబర్‌లోనే.. ముసుగేసింది
నవంబర్‌లోనే.. ముసుగేసింది


