అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
అచ్చంపేట: పట్టణంలోని ఉప్పునుంతల రోడ్డులో నివాసముంటున్న నేనా వ త్ లక్ష్మణ్ మంగళవారం అ నుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎస్‌ఐ సద్దాం హుస్సేన్ కథనం ప్రకారం.. అచ్చంపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన నేనావత్ లక్ష్మన్(38)కు బల్మూర్ మండలం బాణాలకు చెందిన పద్మతో వివాహ మైంది. వీరికి ఇద్దరు పిల్లలు.. భార్య పద్మ ఉప్పునుంతల మండలం గట్టకాడిపల్లి ప్రాథ మిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. లక్ష్మణ్ ఇబ్రహీంపట్నంలో గెస్ట్ లెక్చర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, అదేక్రమంలో ప్రా ణాలు కోల్పోయి ఉంటారని కుటుంబ సభ్యు లు ఆరోపిస్తున్నారు. మృతుడి ఒంటిపై రక్తపు మరకలు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మల్దకల్‌లో మృతి
మల్దకల్: ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘట న మంగళవారం మండలంలోని మద్దలబండలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నందికర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోయ హన్మన్న (31) వ్య వసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. సోమవారం రాత్రి కుటుంబ సమస్యలతో కలిసి ఇంట్లో నిద్రించా డు. మంచంపై పడుకున్న బోయ హన్మన్న మంగళవారం ఉదయం నిద్ర లేవకపోవడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యు లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. హన్మన్నకు భార్య వెంకటమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. తమ కుమారుడి మృతిపై అనుమానం ఉందని తల్లిదండ్రులు ఆరోపించడంతో అను మానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
పాముకాటుకు
మహిళ బలి
నాగర్‌కర్నూల్ క్రైం: పాముకాటుకు గురైన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఔరాసిపల్లికి చెందిన వంగ లక్ష్మమ్మ (45) ఈ నెల 11న గ్రామంలో కూలీ పనులకు వెళ్లగా పాము కాటు వేసింది. చికిత్స నిమిత్తం స్థానిక జనరల్ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. వారం రోజుల చికిత్స అనంతరం నెల 19న డిశ్చార్జ్ అయింది. మరలా ఈ నెల 22న ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు హైదరాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
ఊట్కూర్: మండలంలోని ఎడివెళ్లికి చెందిన సాయిలు (36) చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు. పోలీసుల కథ నం మేరకు .. సాయిలు ఈ నెల 19న పొలం నుంచి వ చ్చి కుంటుబ సభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. కుటుంబ సభ్యులు ఉదయం నిద్రలేపగా అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిగా పరిస్థితి విషమంగా ఉండడంతో మహాబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందా డు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి


