ఏటా తగ్గుతున్న కూరగాయల సాగు
పట్టణీకరణ కారణంగా ఉమ్మడిజిల్లాలో ఉద్యాన పంటల సాగు గణనీయంగా తగ్గిపోయింది. గతంలో మహబూబ్‌నగర్ ప్రజలకు అవసరమైన కూరగాయలను అధిక శాతం సమకూర్చే ఉమ్మడి జిల్లా లో కూరగాయల సాగు తగ్గిపోయింది. రెండు దశాబ్దాలుగా పట్టణ శివార్లలో ఉద్యాన పంటలు సాగు చేసే భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతున్నాయి. దీనికి తోడు కూరగాయలు పండించే రైతులకు సరైన ప్రోత్సాహకం లభించడం లేదు. ఇక్కడ కూరగాయల రైతులు తాము పండించిన పంటను మహబూబ్‌నగర్‌లోని మార్కెట్‌కు రైతుబజార్లకు తరలిస్తుంటారు. అయి తే ఇటీవల కొన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యాలు కూడా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.


